జాబ్‌ కార్డున్న ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు

ABN , First Publish Date - 2022-12-09T01:22:18+05:30 IST

ఏజెన్సీలో ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. తన కార్యాలయం నుంచి ఏజెన్సీ మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో ఉపాధి కూలీల ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియను వేగంగా చేయాలన్నారు. అలాగే గృహ నిర్మాణాలు చేస్తున్న స్థలాలకు లబ్థిదారులతో ఫొటో తీసి జియో ట్యాగింగ్‌ చేయాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా గృహ నిర్మాణాలకు రూ.35 వేల రుణాలను మంజూరు చేయాలని పీవో సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులు నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పూర్తి చేసిన ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను సంబంధిత అధికారులకు అప్పగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

జాబ్‌ కార్డున్న ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

- వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ

పాడేరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. తన కార్యాలయం నుంచి ఏజెన్సీ మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో ఉపాధి కూలీల ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియను వేగంగా చేయాలన్నారు. అలాగే గృహ నిర్మాణాలు చేస్తున్న స్థలాలకు లబ్థిదారులతో ఫొటో తీసి జియో ట్యాగింగ్‌ చేయాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా గృహ నిర్మాణాలకు రూ.35 వేల రుణాలను మంజూరు చేయాలని పీవో సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులు నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పూర్తి చేసిన ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను సంబంధిత అధికారులకు అప్పగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

రహదారి పనుల పురోగతిపై ఆరా

ఏజెన్సీలో జాజుల పాలెం- అంజలి శనివారం, గుల్లేలు -కండ్రూం, చింతపల్లి - సీలేరు రహదారి పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. గుత్తులపుట్టు రోడ్డుకు రూ.35 లక్షలు మంజూరు చేశామని, యుద్ధప్రాతిపదికన పనులు జరిపించాలన్నారు. అలాగే నాడు- నేడు పనులకు విడుదల చేసిన నిధులు ఖర్చు చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.రమేశ్‌ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, కె.వేణుగోపాల్‌, ఆర్‌ అండ్‌ బీ ఈఈ బాల సుందర బాబు, పంచాయతీరాజ్‌ ఈఈ టి.కొండయ్యపడాల్‌, హౌసింగ్‌ పీడీ బీహెచ్‌.శ్రీనివాస్‌, ఈఈ బి.బాబు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ లీలాకృష్ణ, డీఈఈ ప్రకాష్‌, ఏజెన్సీ పదకొండు మండలాలకు చెందిన వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T01:22:20+05:30 IST