షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ స్తంభం వైర్లు దగ్ధం
ABN , First Publish Date - 2022-08-09T05:56:27+05:30 IST
జాతీయ రహదారి నుంచి అక్కిరెడ్డిపాలెం వెళ్లే ప్రధాన రహదారిలో సోమవారం ఓ విద్యుత్ స్తంభంపై వున్న వైర్లు కాలిపోయి పెద్దగా మంటలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అక్కిరెడ్డిపాలెం, ఆగస్టు 8: జాతీయ రహదారి నుంచి అక్కిరెడ్డిపాలెం వెళ్లే ప్రధాన రహదారిలో సోమవారం ఓ విద్యుత్ స్తంభంపై వున్న వైర్లు కాలిపోయి పెద్దగా మంటలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక్కడి ప్రాథమిక పాఠశాలకు సమీపంలో వున్న విద్యుత్ స్తంభంపై ఏర్పడిన షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా వైర్ల నుంచి మంటలు వచ్చాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ స్తంభానికి వున్న పలు ఇళ్లకు చెందిన సర్వీస్ వైర్లతో పాటు వివిధ నెట్‌వర్క్‌లకు చెందిన కేబుల్స్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలో నివసిస్తున్న వారు తమ ఇళ్లకు చెందిన విద్యుత్ మీటర్ల మెయిన్ స్విచ్‌లను ఆపివేశారు. పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బందితో పాటు విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.