Visakha: దువ్వాడ రైల్వేస్టేషన్‌ ఘటన.. విద్యార్థిని శశికళ మృతి

ABN , First Publish Date - 2022-12-08T16:05:48+05:30 IST

విశాఖ (Visakha): దువ్వాడ (Duvvada) స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న శశికళ అనే విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

Visakha: దువ్వాడ రైల్వేస్టేషన్‌ ఘటన.. విద్యార్థిని శశికళ మృతి

విశాఖ (Visakha): దువ్వాడ (Duvvada) స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న శశికళ అనే విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. నిన్న (బుధవారం) విద్యార్థిని దువ్వాడ రైల్వేస్టేషన్‌‌లో ట్రైన్ దిగితూ జారిపడి రైలు-ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. బయటకు తీసిన రైల్వే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం షీలానగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అవయవాలు దెబ్బతినడంతో మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

విద్యార్థిని శశికళ అన్నవరం నుంచి ప్రతిరోజు విశాఖ, దువ్వాడలో ఉన్న విజ్ఞాన కాలేజీకి వస్తుంది. బుధవారం కూడా గుంటూరు (Guntur)-రాయగఢ (Rayagada) ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆమె దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా కాలుజారి రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. దీంతో రైల్వే సిబ్బంది, పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి గంటకుపైగా శ్రమించి ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.

Updated Date - 2022-12-08T16:05:52+05:30 IST