మూడేళ్ల పాలనలో.. ఏడుసార్లు చార్జీల వడ్డనా..?

ABN , First Publish Date - 2022-04-10T06:12:18+05:30 IST

రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాలు మోప డమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టీడీపీ అనకాపల్లి పార్లమెంటు నియో జకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వ రరావు ఆరోపించారు. విద్యుత్‌ చార్జీల పెంపు.. కోతలకు నిరసనగా శనివారం రాత్రి వడ్డాదిలో పార్టీ శ్రేణులు చేపట్టిన ప్రజా చైతన్య ర్యాలీలో మాట్లాడారు.

మూడేళ్ల పాలనలో.. ఏడుసార్లు చార్జీల వడ్డనా..?
వడ్డాదిలో ర్యాలీ నిర్వహిస్తున్న బుద్ద, తాతయ్యబాబు తదితరులు

  ప్రభుత్వ తీరుపై టీడీపీ నాయకుడు ‘బుద్ద’ ఆగ్రహం

విద్యుత్‌ భారాలు.. కోతలపై బుచ్చెయ్యపేట, మాడుగుల, రోలుగుంటలలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన  

బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 9 : రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాలు మోప డమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టీడీపీ అనకాపల్లి పార్లమెంటు నియో జకవర్గ  అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వ రరావు ఆరోపించారు.  విద్యుత్‌ చార్జీల పెంపు.. కోతలకు నిరసనగా శనివారం రాత్రి వడ్డాదిలో పార్టీ శ్రేణులు చేపట్టిన ప్రజా చైతన్య ర్యాలీలో మాట్లాడారు. మూడేళ్ల పాలనలో ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారంటే జగన్‌ అసమర్థ పాలనకు ఇదే ఓ పెద్ద నిదర్శనంగా పేర్కొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌  చార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ జగన్‌ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. ఎన్ని కలు ఎప్పుడు వచ్చినా టీడీపీకి అధి కారం తథ్యమన్నారు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కేవీఎస్‌ఎన్‌ఎస్‌.రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గునూరు మల్లునాయుడు, నాయకులు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, వియ్యపు అప్పారావు, గోకివాడ కోటేశ్వరరావు, దొండా రమేష్‌, దొండా గిరిబాబు పాల్గొన్నారు. 

మాడుగులలో..

మాడుగుల : వైసీపీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రజ లకు అన్నీ కష్టాలేనని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, ఇంటి పన్ను, చెత్త పన్నులతో పాటు తాజాగా విద్యుత్‌ చార్జీల పెంపును నిరసి స్తూ శనివారం ఇక్కడ ఆందోళన చేపట్టారు. ముం దుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానా లను ఎండ గట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీ ల్దార్‌ పి.వి.రత్నంకి వినతి పత్రం అందజేశారు. టీడీపీ నాయకులు ఉండూరు దేముడు, లెక్కల కాశిబాబు, రంజిత్‌, రమణమ్మ, మజ్జి తాతబాబు, పుప్పాల రమేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

కొమరవోలులో...

రోలుగుంట : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ శ్రేణులు కొమరవోలులో ఇంటింట ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గుములూ చంద్రమౌళి మాట్లాడుతూ నిత్యావసర వసు ్తవుల ధరలతో పాటు విద్యుత్‌ చార్జీల భారం ప్రజలను మరిన్ని కష్టా ల్లోకి నెట్టిందన్నారు. వెంటనే విద్యుత్‌ చార్జీ లను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సామిరెడ్డి ముసలయ్యనాయుడు, బోళెం రమేష్‌, ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, లగుడు సత్తిబాబు, కైసర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read more