రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ టోర్నీకి జిల్లా జట్టు

ABN , First Publish Date - 2022-11-24T00:08:26+05:30 IST

రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, యూత్‌, సీనియర్‌ పురుషుల మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీకి జిల్లా జట్టును ప్రకటించారు.

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ టోర్నీకి జిల్లా జట్టు

విశాఖపట్నం(స్పోర్ట్సు), నవంబరు 23: రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, యూత్‌, సీనియర్‌ పురుషుల మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీకి జిల్లా జట్టును ప్రకటించారు. మాధవధారలోని మాధవి భారతి వెల్పేర్‌ అసోసియేషన్‌ ప్రాంగణంలో బుధవారం జరిగిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో ప్రతిభ చూపిన ఎనిమిది మందిని ఎంపిక చేశామని జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ సంఘం కార్యదర్శి కంచరాన సూర్యనారాయణ తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన లిఫ్టర్లు ఈ నెల 28, 29 తేదీల్లో నాగార్జునసాగర్‌లోని వెయిట్‌ లిఫ్టింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో జరిగే తొమ్మిదవ రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొంటారని పేర్కొన్నారు.

జిల్లా జట్టు సభ్యులు:

సీనియర్‌ పురుషుల కేటగిరీలో ఎన్‌.అర్జున్‌, ప్రశాంత్‌ బిశాయ్‌, ఎస్‌.రమేశ్‌ చంద్ర బెనర్జీ...మహిళల విభాగంలో కేవీఎల్‌ పావనికుమారి; జూనియర్‌ కమ్‌ సీనియర్‌ పురుషుల విభాగంలో జి.హేమంత్‌కుమార్‌, జి.కిరణ్‌కుమార్‌, ఎస్‌కే.లాల్‌ బషీర్‌; సబ్‌ జూనియర్‌ బాలికల విభాగంలో ఎ.రేవతి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎం.సూర్యారావు, మేనేజర్‌గా ఎస్‌.కేశవ వ్యవహరించనున్నారు.

Updated Date - 2022-11-24T00:08:26+05:30 IST

Read more