6న జిల్లా చదరంగం జట్టు ఎంపిక పోటీలు

ABN , First Publish Date - 2022-08-04T05:43:10+05:30 IST

జిల్లా చదరంగం జట్టు ఎంపికలు ఈ నెల ఆరున రాంనగర్‌ వద్ద గల లయన్స్‌ క్లబ్‌ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు ఆల్‌ వైజాగ్‌ చెస్‌ సంఘం కార్యదర్శి ఎస్‌.మణికంఠరావు తెలిపారు.

6న జిల్లా చదరంగం జట్టు ఎంపిక పోటీలు

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఆగస్టు 3: జిల్లా చదరంగం జట్టు ఎంపికలు ఈ నెల ఆరున రాంనగర్‌ వద్ద గల లయన్స్‌ క్లబ్‌ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు ఆల్‌ వైజాగ్‌ చెస్‌ సంఘం కార్యదర్శి ఎస్‌.మణికంఠరావు తెలిపారు. ఓపెన్‌, అండర్‌-11 బాలికల విభాగాలలో జరిగే ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనేవారు జనవరి ఒకటి 2011న లేదా ఆ తర్వాత పుట్టినవారై ఉండాలని స్పష్టం చేశారు. తొలి రెండు స్థానాలలో నిలిచిన వారు ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నీలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఐదవ తేదీలోపు విక్రమ్‌ ఫోన్‌:8886591888, నాగరాజు ఫోన్‌:7989162930 నందు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 


Updated Date - 2022-08-04T05:43:10+05:30 IST