పార్టీ బలోపేతంపై జిల్లా స్థాయి ప్లీనరీలో చర్చ

ABN , First Publish Date - 2022-06-30T05:59:56+05:30 IST

జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన భవిష్యత్తు కార్యాచరణపై గురువారం జరిగే జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చిస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పార్టీ బలోపేతంపై జిల్లా స్థాయి ప్లీనరీలో చర్చ
సమావేశంలో మాట్లాడుతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు

 వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన భవిష్యత్తు కార్యాచరణపై గురువారం జరిగే జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చిస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామని, మిగిలినవి త్వరలోనే నెరవేర్చుతామన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలోని 1.25 కోట్ల కుటుంబాలకు రూ.1.4 లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగే ప్లీనరీకి ఉమ్మడి విశాఖజిల్లా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఇన్‌చార్జి మంత్రి విడదల రజని, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు, క్రీయాశీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొంటారన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం  సంక్షేమ పథకాలు,  అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్తు కార్యాచరణపై  తీర్మానం చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధాకర్‌, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి అప్పారావు, తదితరులున్నారు. 

Updated Date - 2022-06-30T05:59:56+05:30 IST