జీడిమామిడి ఫలసాయం వేలం ఆపాలి

ABN , First Publish Date - 2022-03-05T06:19:52+05:30 IST

కోటవురట్ల మండలంలో నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్న జీడిమామిడి తోటల ఫలసాయం వేలం పాటను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నర్సీపట్నం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

జీడిమామిడి ఫలసాయం వేలం ఆపాలి
నర్సీపట్నం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం

సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా


నర్సీపట్నం అర్బన్‌, మార్చి 4: కోటవురట్ల మండలంలో నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్న జీడిమామిడి తోటల ఫలసాయం వేలం పాటను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నర్సీపట్నం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ, తిమ్మాపురం, కైలాసపట్నం, టి.జగ్గంపేట, వెంకటాపురం గ్రామాలకు చెందిన పలువురు పేద రైతులు  35 ఏళ్లగా జీడిమామిడి తోటలను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే  ఇవి అటవీ భూములంటూ ఫారెస్టు అధికారులు ఫలసాయానికి వేలంపాట నిర్వహించడం శోచనీయమని అన్నారు. వేలం పాటను రద్దు చేసి, సాగుదారులే ఫలసాయం పొందేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొండలరావు, రాజాన దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T06:19:52+05:30 IST