ధారాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-04-04T05:46:19+05:30 IST
ధారకొండ ధారాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
సీలేరు, ఏప్రిల్ 3: ధారకొండ ధారాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తలనీలాలు తీయించుకున్న తర్వాత స్నానాల గదులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ వాహనాలను రోడ్డుకిరువైపులా ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేయడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దేవదాయ శాఖ గాని, ఆలయ కమిటీ సభ్యులు గాని చర్యలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.