కన్నుల పండువగా దీపోత్సవం

ABN , First Publish Date - 2022-11-19T01:12:02+05:30 IST

కార్తీక మాసం సందర్భంగా స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయం వద్ద శుక్రవారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కన్నుల పండువగా దీపోత్సవం
గౌరీశ్వరాలయం వద్ద దీపోత్సవం సందడి

చోడవరం, నవంబరు 18: కార్తీక మాసం సందర్భంగా స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయం వద్ద శుక్రవారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దీపోత్సవంలో 31వేల దీపాలను భక్తులు వెలిగించారు. ప్రధానార్చకులు కొడమంచిలి చలపతి ఆఽధ్వర్యంలో అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం రాత్రి 8గంటలకు దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ గూనూరు సత్యనారాయణ, దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రముఖులు శరగడం సిమ్మునాయుడు,దేవరపల్లి సత్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T01:12:04+05:30 IST