-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Darshan of Lord Jagannath in Kurmavatar-MRGS-AndhraPradesh
-
కూర్మావతారంలో జగన్నాఽథుడి దర్శనం
ABN , First Publish Date - 2022-07-04T05:22:06+05:30 IST
టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టౌర్నర్ చౌల్ర్టీ కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన జగన్నాఽథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.

మహారాణిపేట, జూలై 3: టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టౌర్నర్ చౌల్ర్టీ కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన జగన్నాఽథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. దశావతారాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం స్వామివారు కూర్మావతార అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం సుమారు 500 మందికి అన్నదాన మహాప్రసాదాన్ని అందించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భక్తి తరంగిణి, అన్నమయ్య సంకీర్తనలు, కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు.