Andhra Pradesh: జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి లక్షల కోట్లలో అప్పు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ABN , First Publish Date - 2022-05-17T20:39:25+05:30 IST
CM జగన్ పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు

Vishakapatname: CM జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు ఉంటుందన్నారు. చేసిన అప్పులకు జగన్ లెక్కలు చెప్పడం లేదన్నారు. అప్పులుచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టును జగన్ మూలన పడేశారని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుంటే జగన్ మాట్లాడడం లేదన్నారు. ప్రధానికి కనీసం జగన్ ఒక అర్జీ కూడా ఇవ్వలేదన్నారు. మద్యపాన నిషేధమని చెప్పి, పాత బ్రాండ్లను నిషేధించి, తన బ్రాండ్ ప్రజల్లోకి వదిలారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన డబ్బు తాడేపల్లికి వెళుతుందన్నారు. రెండు వారాల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు చేయలేదని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ కలరాస్తున్నాడని, విజయవాడకు వస్తే అరెస్టులు చేస్తావా? అని ప్రశ్నించారు.