రెండు నెలల్లోగా ప్రభుత్వ భవన నిర్మాణాలు పూర్తి

ABN , First Publish Date - 2022-12-15T01:12:28+05:30 IST

రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవనాల నిర్మాణాలను రెండు నెలల్లోగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అధికారులను ఆదేశించారు.

రెండు నెలల్లోగా ప్రభుత్వ భవన నిర్మాణాలు పూర్తి
పంచాయతీలో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

పరవాడ, డిసెంబరు 14: రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవనాల నిర్మాణాలను రెండు నెలల్లోగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అధికారులను ఆదేశించారు. మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పం చాయతీలో సమస్యలను సర్పంచ్‌ కూండ్రపు వరలక్ష్మి ఆయనకు వివరించారు. ముఖ్యంగా గంగునాయుడుపాలెం నుంచి వెంకటపతిపాలెం వరకు, కోరంగివానిపాలెం నుంచి గొల్లపేట వరకు కనెక్టింగ్‌ రహదారులు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మెట్టపాలెం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఆట స్థలం కేటాయించాలన్నారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలోనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తొలిత ఆయన నాయుడుపాలెం సచివాలయాన్ని సందర్శించి, సేవలపై ఆరా తీశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సబ్బందికి సూచించారు. అనంతరం ఆయన అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణను పరిశీలించారు. అలాగే మెట్టపాలెం ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి సమస్యలను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి.హేమసుందరరావు, తహసీల్దార్‌ ప్రకాశరావు, ఎంఈవో ఎం.సునీత, మండల ఇంజనీర్‌ గండి సత్యరామారావు, హౌసింగ్‌ ఏఈ ఎంఎస్‌ ఎస్‌ఎన్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కూండ్రపు సీతారామయ్యలతో పాటు అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:12:30+05:30 IST