మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2022-10-29T00:08:26+05:30 IST

జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ముంచంగిపుట్టులో దట్టంగా కురుస్తున్న మంచు

దట్టంగా కురుస్తున్న మంచు

చింతపల్లి, అక్టోబరు 28: జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం చింతపల్లిలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేశ్‌ కుమార్‌ తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలితీవ్రత పెరిగింది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటగల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది. స్థానికులు ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో మండలంలో చలి తీవ్రత పెరిగింది. మంచు దట్టంగా కురుస్తున్నది. శుక్రవారం ఉదయం పది గంటల వరకు మంచుతెరలు వీడలేదు. దీనికి తోడు చలిగాలులు వీస్తుండడంతో ఆరుబయట పనులు చేసే వారు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఉదయం తొమ్మిది గంటల తరువాతే పొలాలకు వెళుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకల్లా ఇళ్లకు చేరుకుంటున్నారు. చీకటి పడిన తరువాత జనం ఇళ్లకే పరిమితం కావడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Updated Date - 2022-10-29T00:08:31+05:30 IST