బస్సులకు పూర్తి శానిటైజేషన్‌

ABN , First Publish Date - 2022-01-13T06:22:29+05:30 IST

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం ప్రయాణికుల రవాణా కోసం వినియోగిస్తున్న అన్ని బస్సులకు పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయిస్తున్నది.

బస్సులకు పూర్తి శానిటైజేషన్‌
ప్రజారవాణాకు వినియోగిస్తున్న బస్సులకు పూర్తిశానిటైజేషన్‌ చేయిస్తున్న పీటీడీ అధికారులు

ద్వారకా బస్‌స్టేషన్‌, జనవరి 12: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌  యాజమాన్యం ప్రయాణికుల రవాణా కోసం వినియోగిస్తున్న అన్ని బస్సులకు పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయిస్తున్నది. బస్సులకు పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేశాకే ప్రయాణికుల రవాణాకు వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది. విశాఖ రీజియన్‌లోని పది డిపోలకు చెందిన బస్సులన్నింటికీ శానిటైజేషన్‌ చేస్తున్నారు. డిపోకు వచ్చిన బస్సుకు హైపర్‌ క్లోరైడ్‌తో శానిటైజ్‌ చేసి తిరిగి ప్రయాణికుల రవాణాకు వినియోగిస్తున్నారు. రీజనల్‌ మేనేజర్‌ అంధవరపు అప్పలరాజు, డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు కణితి వెంకటరావు (జిల్లా), కె.పద్మావతి (అర్బన్‌) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 


Updated Date - 2022-01-13T06:22:29+05:30 IST