యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-10-17T05:58:33+05:30 IST

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, సానుకూల దృక్పథనాన్నిపెంపొందిస్తుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి అన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి

ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి

విశాఖపట్నం, అక్టోబరు 16: సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, సానుకూల దృక్పథనాన్నిపెంపొందిస్తుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి అన్నారు. జిల్లా యోగా సంఘం, ఏయూ యోగా విభాగం సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉత్తర కోస్తా జిల్లాల యోగా సదస్సులో వీసీ మాట్లాడారు. మానవ జీవితంలో యోగా ఒక భాగమైందన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఓఎన్‌ఆర్‌యూ భానుకుమార్‌, డాక్టర్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T05:58:33+05:30 IST