పౌరగ్రంథాలయంలో పేపర్‌ విభాగం ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-04T06:22:36+05:30 IST

పౌరగ్రంథాలయంలో పునరుద్ధరించిన పేపర్‌, కెరీర్‌ విభాగాలను హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రత్నరాజ్‌ గురువారం ప్రారంభించారు.

పౌరగ్రంథాలయంలో పేపర్‌ విభాగం ప్రారంభం
పేపర్‌ సెక్షన్‌ ప్రారంభిస్తున్న హెచ్‌పీసీఎల్‌ ఈడీ రత్నరాజ్‌

విశాఖపట్నం, మార్చి 3: పౌరగ్రంథాలయంలో పునరుద్ధరించిన పేపర్‌, కెరీర్‌ విభాగాలను హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రత్నరాజ్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ నిర్వహణను అభినందించారు. గ్రంథాలయ సొసైటీ కార్యదర్శి డి.ఎస్‌.వర్మ మాట్లాడుతూ ఈ విభాగాల పునరుద్ధరణకు సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా రూ.39 లక్షలు హెచ్‌పీసీఎల్‌ అందించినట్లు తెలిపారు. పేపర్‌ విభాగంలో 80 మంది, కెరీర్స్‌ విభాగంలో 140 మంది ఒకేసారి చదువుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్‌ హెచ్‌ఆర్‌ అండ్‌ ఐఆర్‌ జీఎం కె.నగేష్‌, సీనియర్‌ మేనేజర్‌ కాళీ, ఆచార్య ప్రసన్నకుమార్‌, డాక్టర్‌ సూరపనేని విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more