హాస్యభరిత చిత్రం ‘వాంటెడ్ పండుగాడు’
ABN , First Publish Date - 2022-08-12T06:39:02+05:30 IST
హాస్య భరిత ‘వాం టెడ్ పండుగాడు’ చిత్రం హాస్య ప్రియులను అల రిస్తుందని ప్రధాన పాత్రధారులు సుడిగాలి సుధీర్, పృధ్వీరాజ్ అన్నారు.
ప్రధాన పాత్రధారులు సుడిగాలి సుధీర్, పృధ్వీరాజ్
విశాఖపట్నం, ఆగస్టు 11: హాస్య భరిత ‘వాం టెడ్ పండుగాడు’ చిత్రం హాస్య ప్రియులను అల రిస్తుందని ప్రధాన పాత్రధారులు సుడిగాలి సుధీర్, పృధ్వీరాజ్ అన్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా నగరానికి విచ్చేసిన చిత్ర యూనిట్ గురు వారం సాయంత్రం ఓ హోటల్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నటి దీపిక పిల్లి, షకలకశంకర్, వెంకట్‌లతో కలిసి మాట్లాడారు. దర్శకులు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నటించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆద్యంతం చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తుందని చెప్పారు. ఈనెల 19న చిత్రం విడుదల కానుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.