జీవీఎంసీ అధికారులకు సీఎం అభినందన

ABN , First Publish Date - 2022-10-08T06:09:25+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో జీవీఎంసీ జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం, స్వచ్ఛతా లీగ్‌లో మొదటి స్థానం సాధించడంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రేటర్‌ అధికారులను అభినందించారు.

జీవీఎంసీ అధికారులకు సీఎం అభినందన
జీవీఎంసీ అధికారులను అభినందిస్తున్న సీఎం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచన

విశాఖపట్నం, అక్టోబరు 7: స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో జీవీఎంసీ జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం, స్వచ్ఛతా లీగ్‌లో మొదటి స్థానం సాధించడంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రేటర్‌ అధికారులను అభినందించారు. మున్సిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్‌, పూర్వపు కమిషర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా, ప్రస్తుత కమిషనర్‌ పి.రాజాబాబు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌, అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్ర్తి బృందం శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి జీవీఎంసీకి లభించిన అవార్డును చూపించారు.


ఈ సందర్భంగా సీఎం జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌, పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్‌ నియంత్రణ కొరకు చేస్తున్న కృషికి అధికార్లకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, విశాఖ ప్రజలు కలిసి పని చేస్తే వచ్చే సంవత్సరం మొదటి స్థానం దక్కించుకోగలుగుతారని సీఎం దిశానిర్దేశం చేసినట్లు కమిషర్‌ రాజాబాబు తెలిపారు.

Read more