ఎస్‌బీపట్నం పాల సొసైటీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ

ABN , First Publish Date - 2022-09-29T06:50:15+05:30 IST

మండలంలోని శరభూపాలపట్నం (ఎస్‌బీపట్నం) పాల సొసైటీ అధ్యక్ష ఎన్నికలలో బుధవారం వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు జో క్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

ఎస్‌బీపట్నం పాల సొసైటీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ
ఎస్‌బీపట్నంలో పాల సొసైటీ ఎన్నికలలో ఘర్షణ పడుతున్న రైతులను అడ్డుకుంటున్న పోలీసులు

అడ్డుకున్న పోలీసులు

ఎన్నిక నిర్వహించకుండా వెళ్లిపోయిన  విశాఖ డెయిరీ అధికారి

అధ్యక్షులను ప్రకటించుకున్న ఇరు పార్టీల నాయకులు 

నాతవరం, సెప్టెంబరు 28 : మండలంలోని శరభూపాలపట్నం (ఎస్‌బీపట్నం) పాల సొసైటీ అధ్యక్ష ఎన్నికలలో బుధవారం వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు జో క్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే అధ్యక్ష ఎన్నిక నిర్వహించకుండా ఎన్నికల అధికారి వెళ్లిపో యారు. దీంతో ఇరుపార్టీల నేతలు తమ అధ్యక్షులను ప్రకటించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎస్‌బీపట్నంలో విశాఖ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష పదవికి బుధవారం జరిగిన ఎన్నికల్లో వైసీ పీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గొడవ జరగకుండా ఇరువర్గాలకు నచ్చ జెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అయితే ఇరు పార్టీల మధ్య గొడవ జరుగుతుం డడంతో ఎన్నికల అధికారి అధ్యక్ష ఎన్నిక నిర్వహించకుండా వెళ్లిపోయారు. సొసైటీలో 45 మంది పాడి రైతులు ఉండగా ఎన్నికలు జరిపి మెజారిటీ సభ్యుల ఆమోదంతో పాల సంఘం అధ్యక్షుడిని ఎన్నుకోవాలని టీడీపీ మద్దతుదారులు కోరగా.. ఎన్నిక పెట్టకుండానే పది మంది సభ్యుల ఆమోదంతో వైసీపీకి చెందిన మాకిరెడ్డి శ్రీనును అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. దీంతో ఆ గ్రామ సర్పంచ్‌ లోకవరపు సత్యనారాయణ ఆధ్వ ర్యంలో 35 మంది పాల రైతులు పాల సంఘం అధ్యక్షుడిగా గాడి దేముళ్లును ఎన్ను కున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విశాఖ డెయిరీ అధికారుల సమక్షంలో పాల సొసైటీ ఎన్నికలు జరిగేవని, అయితే ఈ ఏడాది ఎన్నికకు గంట ముందు విశాఖ డెయిరీ అధికారి వచ్చి ఎన్నిక జరపకుండానే వెళ్లిపోయారన్నారు. సొసైటీలో 35మంది రైతుల మద్దతు ఉన్న టీడీపీ మద్దతుదారుని ఎస్‌బీపట్నం పాల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకోకుండా పది మంది రైతుల మద్దతు ఉన్న వైసీపీ వారిని పాల సొసైటీ అధ్యక్షుడిగా అధికారులు నియమిస్తే ఊరుకోమని వారంటున్నారు.

Read more