నేడు కర్నూలుకు చంద్రబాబు

ABN , First Publish Date - 2022-11-16T03:14:19+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు చేరుకుంటారు.

నేడు కర్నూలుకు చంద్రబాబు

మూడు రోజులపాటు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సాయంత్రం 4గంటలకు పత్తికొండ ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకుని రోడ్‌షో, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి ఆదోనిలో బస చేస్తారు. 17న ఉదయం 11 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తూ ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. 18న మధ్యాహ్నం కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీసుకు వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - 2022-11-16T03:14:19+05:30 IST

Read more