సమాచారం లేకుండానే రైళ్ల రద్దు..!
ABN , First Publish Date - 2022-11-15T03:22:45+05:30 IST
నాన్ ఇంటర్ లాకింగ్ పనుల పేరుతో ఆకస్మికంగా రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైల్వే తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
విజయవాడ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నాన్ ఇంటర్ లాకింగ్ పనుల పేరుతో ఆకస్మికంగా రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దు చేయని రైళ్లు కూడా గంటల తరబడి ఆలస్యంగా నడవడంతో.. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు నానా తంటాలు పడ్డారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపుపై ముందస్తు సమాచారం లేకపోవటం వల్ల తలెత్తిన సమస్య ఇది. చినగంజాం-కార్వాడీ సెక్షన్‌లో మూడోలైన్ పునరుద్ధరణకు సంబంధించి నాన్ ఇంటర్‌లాకింగ్ పనులను రైల్వే అధికారులు చేపట్టారు. ఈ పనులు నాలుగు రోజులపాటు కొనసాగుతాయి. అయితే ఈ క్రమంలో ఏఏ రైళ్లు రద్దు అవుతున్నాయో, ఏవి ఆలస్యంగా నడుస్తాయో ప్రకటించి ఉంటే.. దానికి అనుగుణంగా ప్రయాణికులు ఏర్పాట్లు చేసుకునేవారు. ఆ పని చేయకపోవటం వల్ల వారు ఇబ్బందులు పడ్డారు.
14 నుంచి 18 వ తేదీ వరకు రద్దయిన రైళ్లు ఇవీ..: నవంబరు 14 నుంచి 18 వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా.. విజయవాడ - ఒంగోలు (ట్రైన్ నంబర్ 07461), ఒంగోలు - విజయవాడ (07576), విజయవాడ - గూడూరు (07500) గూడూరు - విజయవాడ (07458), విజయవాడ - బిట్రగుంట (07978), బిట్రగుంట - విజయవాడ (07977), విజయవాడ - గుడూరు (17260), గూడూరు - విజయవాడ (17259) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
భారీ ఆలస్యంగా నడిచిన రైళ్లు ఇవీ..: నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా భారీగా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. తిరుపతి-భువనేశ్వర్ (22872) 70 నిమిషాలు, చెన్నై-అహ్మదాబాద్ (12656) 55 నిమిషాలు, హౌరా-కన్యాకుమారి (12665) 65ని., సంత్రాగచి-తంబారం (22841) 50ని., ఆదిలాబాద్-తిరుపతి (17406) 15ని, న్యూ తిన్సుకియా-తాంబరం (15930) 100 నిమిషాల ఆలస్యమయ్యాయి.
నేడు, రేపు, ఎల్లుండి ఆలస్యంగా నడిచే రైళ్లు ఇవే..
రామేశ్వరం-అజ్మీర్ (20974) 170 నిమిషాలు, త్రివేండ్రం సెంట్రల్ - సిల్చార్ (12507) 150 ని; చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ (12656) 120 ని; చెన్నై సెంట్రల్- న్యూ జల్పాయిగురి (22611) 85ని; తిరుపతి-పూరి (17480) 70 ని; సత్రాగంచి- చెన్నై (22807) 90ని; ఆదిలాబాద్-చెన్నై (22807) 90ని; నిజాముద్దీన్-చెన్నై (12270) 45ని; హతియా-బెంగళూరు (12835) 30ని; బిలా్‌సపూర్-తిరుపతి (17481) 20ని; విశాఖపట్నం-కొల్లాం (18567) 50ని; ఆదిలాబాద్-తిరుపతి (17406) 15ని; గూడూరు-విజయవాడ (12743) 90ని; త్రివేండ్రం సెంట్రల్- న్యూ ఢిల్లీ (12625) 45 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు ప్రకటించారు.