రూ.1.28 కోట్లతో కాటేజీల నిర్మాణం

ABN , First Publish Date - 2022-08-04T05:30:00+05:30 IST

అరకులోయలో కాటేజీల నిర్మాణంపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారించింది. పద్మాపురం గార్డెన్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా రూ.64 లక్షల వ్యయంతో ఆరు ట్రీహట్స్‌ను నిర్మిస్తున్నారు.

రూ.1.28 కోట్లతో కాటేజీల నిర్మాణం
కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫామ్‌లో ఐటీడీఏ నిర్మిస్తున్న కాటేజీలు

- పద్మాపురం గార్డెన్‌లో ఆరు ట్రీహట్స్‌

- కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫామ్‌లో 12 కాటేజీలు

- శరవేగంగా సాగుతున్న పనులు

అరకులోయ, ఆగస్టు 4: అరకులోయలో కాటేజీల నిర్మాణంపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారించింది. పద్మాపురం గార్డెన్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా రూ.64 లక్షల వ్యయంతో ఆరు ట్రీహట్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ ట్రీహట్స్‌ నిర్మాణ   పనులు లింటల్‌ స్థాయి వరకు వచ్చాయి. అలాగే కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫామ్‌లో  12 కాటేజీలను రూ.64 లక్షలతో నిర్మిస్తు న్నారు. ఇక్కడ మూడు బ్లాకుల్లో 12 కాటేజీలు నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాకులో నాలుగు కాటేజీలు ఉంటాయి. ఈ నిధులన్నీ పద్మాపురం గార్డెన్‌ ఆదాయం నుంచి సమకూర్చినవేనని తెలిసింది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.


Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST