చంద్రబాబును విమర్శించే స్థాయి బూడికి లేదు..

ABN , First Publish Date - 2022-09-28T06:30:21+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని విమర్శించే హక్కు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు లేదని టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు అన్నారు.

చంద్రబాబును విమర్శించే స్థాయి బూడికి లేదు..
పైలా ప్రసాదరావు


బీసీలపై అనుచిత వ్యాఖ్యలు తగవు...

మంత్రి విమర్శలపై ఘాటుగా స్పందించిన టీడీపీ నేత పైలా 

మాడుగుల, సెప్టెంబరు 27: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని విమర్శించే హక్కు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు లేదని టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు అన్నారు. చీడికాడలో జరిగిన సభలో మంత్రి బూడి ముత్యాలనాయుడు నోటికొచ్చినట్టు చంద్రబాబునాయుడుని, బీసీ కులాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆరోగ్యం బాగోలేక పోతే ఆస్పత్రికి వెళ్లాలే తప్ప ప్రతిపక్ష నాయుకుడుపై మతి స్థిమితం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. స్థాయిని మరచి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాలనాయుడు తన నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉంటే ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలో ఉన్నార న్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన బూడి సొంత నియోజకవర్గంలో రోడ్లు వేయించుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. అటువంటి వ్యక్తి బీసీలు, మాజీ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే ముత్యాలనాయుడుకు రోడ్లు గుంతలు పూడ్చలేని నాయకుడిగా మంచి పేరుందన్నారు. చోడవరం నుంచి మాడుగుల వెళ్లినా.. తారువ నుంచి ఆనందపురం వెళ్లినా రోడ్లుపై పడిన గుంతలే మీ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. 


Read more