విశాఖలో బ్రదర్ అనిల్ కుమార్...

ABN , First Publish Date - 2022-03-14T19:35:25+05:30 IST

విశాఖ: నగరంలో బ్రదర్ అనిల్ కుమార్ పర్యటిస్తున్నారు.

విశాఖలో బ్రదర్ అనిల్ కుమార్...

విశాఖ: నగరంలో బ్రదర్ అనిల్ కుమార్ పర్యటిస్తున్నారు. మిషనరీ సంస్థలు, వివిధ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పాదయాత్ర చేసే సమయంలో కలిసి పనిచేసినవారు చాలమంది బ్రదర్ అనిల్‌తో భేటీ అయ్యారు. నవంబర్ నెలాఖరులో అనిల్ విశాఖ వచ్చారు. అప్పుడు కొంతమందితో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇప్పుడు షర్మిల ఏపీకి వస్తే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? తాజా రాజకీయ పరిస్థితి తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో బ్రదర్ అనిల్‌తో సుమారు 70 మంది వరకు హాజరయ్యారు.

Updated Date - 2022-03-14T19:35:25+05:30 IST