-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Bonala Sambaram is an eyeopener in Upamaka-NGTS-AndhraPradesh
-
ఉపమాకలో నేత్రపర్వంగా బోనాల సంబరం
ABN , First Publish Date - 2022-10-02T06:20:19+05:30 IST
మండలంలోని ఉపమాకలో దుర్గామాత బోనాల సంబరం శనివారం కన్నుల పండువగా జరిగింది.

నక్కపల్లి, అక్టోబరు 1 : మండలంలోని ఉపమాకలో దుర్గామాత బోనాల సంబరం శనివారం కన్నుల పండువగా జరిగింది. ముందుగా గురుభవానీ పీఠం వద్ద దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహించి, శరణుఘోష మధ్య అమ్మవారి వెండి ఘటం, బోనాలను ఊరేగించారు. అనంతరం దుర్గాభవానీ ఆలయం వద్ద కు చేరుకుని బోనాలతో పాటు సారెను సమర్పించారు. గురుభవానీ పీఠం తరఫున పెద్దఎత్తున అన్నసమారాధన జరిపారు. గురుభవానీ దవరసింగి రాంబాబు, ఉపమాక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.