-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Bojjannakonda development with Rs1306 crore-NGTS-AndhraPradesh
-
రూ.13.06 కోట్లతో బొజ్జన్నకొండ అభివృద్ధి
ABN , First Publish Date - 2022-03-05T06:29:36+05:30 IST
ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండను రూ.13.06 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి తెలిపారు.

ఎంపీ డాక్టర్ సత్యవతి
తుమ్మపాల, మార్చి 4: ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండను రూ.13.06 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి తెలిపారు. శుక్రవారం పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ, బొజ్జన్నకొండ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.13.06 కోట్లు మంజూరు చేసిందన్నారు. మార్చి బడ్జెట్‌లోనే నిధులు విడుదలవుతాయని, ఏప్రిల్‌లో పనులు ప్రారంభమై నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే పురావస్తు శాఖ నుంచి అభివృద్ధి పనులకు అనుమతులు కూడా వచ్చాయన్నారు. అలాగే శంకరం నుంచి బొజ్జన్నకొండ వరకు రూ.1.2 కోట్ల వీఎంఆర్‌డీఏ నిధులతో రోడ్డు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ అధికారులు ఎ.భానుప్రకాష్‌వర్మ, కేవీఎస్ మూర్తి, రమణ, శంకరం సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు.