-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » BJP MP GVL Narasimha rao visakhapatnam andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
GVL: మహాత్మాగాంధీకి అత్యంత ఇష్టమైంది ఖాదీ
ABN , First Publish Date - 2022-10-02T17:36:53+05:30 IST
మహాత్మాగాంధీకి అత్యంత ఇష్టమైంది ఖాదీ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

విశాఖపట్నం: మహాత్మాగాంధీ (Mahatma gandhi)కి అత్యంత ఇష్టమైంది ఖాదీ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha rao) అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... గాంధీ(Gnadhi)ని ఆదర్శంగా తీసుకొని మోదీ (Modi) ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గాంధీ పేరును ఒక కుటుంబం రాజకీయ లబ్ది కోసం వాడుకొంటుందన్నారు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి, భగత్ సింగ్, పటేల్ మహనీయులను మోదీ సర్కారు (Modi government) ఘనంగా గౌరవిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రెండు కుటుంబాలే పాలిస్తున్నాయని... అన్నింటికి మీ పేర్లు పెట్టుకోవద్దని హితవుపలికారు. రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు చేసిన వారిని కూడా గుర్తు పెట్టుకోవాలని జీవీఎల్ (BJP MP) అన్నారు.