జగన్‌ను సీఎం చేయాలన్నదే బీజేపీ, మోదీ ఆకాంక్ష: అమరనాథరెడ్డి
ABN , First Publish Date - 2022-11-22T01:58:47+05:30 IST
రానున్న ఎన్నికల్లో జగన్‌నే సీఎం చేయాలన్న ది బీజేపీ, ప్రధాని మోదీ ఆకాంక్షగా ఉందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అభిప్రాయపడ్డారు.
పలమనేరు, నవంబరు 21: రానున్న ఎన్నికల్లో జగన్‌నే సీఎం చేయాలన్న ది బీజేపీ, ప్రధాని మోదీ ఆకాంక్షగా ఉందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం ఆయన టీడీపీ నియోజకవర్గ సెక్షన్, బూత్ కమిటీ ఇన్‌చార్జీల సమావేశంలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు సీఎం కాకూడదని, టీడీపీ అధికారంలోకి రాకూడదని ప్రధాని, రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. విశాఖలో జనసేన అధినేత ప్రధాని మోదీ ని కలిసి వచ్చిన తరువాత పవన్ హావభావాల ు పరిశీలించిన వారు లోపల ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు’’ అని అన్నారు.