Ayyanna Patrudu: ఏపీ సీఐడీ పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు..

ABN , First Publish Date - 2022-10-01T21:44:35+05:30 IST

ఏపీ సీఐడీ పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.

Ayyanna Patrudu: ఏపీ సీఐడీ పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు..

విశాఖ (Visakha): ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఇంట్లో చిన్నపిల్లలు లేరా?.. ఏపీ సీఐడీ పోలీసులు (CID  Police) హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) మండిపడ్డారు. తన కుమారుడు చింతకాయల విజయ్ (Chintakayala Vijay) ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లడంపై స్పందించిన అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా సీఐడీ పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారన్నారు.


ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందని అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. తాను ఎప్పుడు తప్పు చేయలేదని, బెదిరిస్తే వెనక్కి తగ్గేవాళ్లం కాదన్నారు. ఏం తప్పు చేశామని తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని అయ్యన్నపాత్రుడు నిలదీశారు.

Read more