టీడీపీ ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్‌వేర్ కొనలేదని గౌతమ్ సవాంగే చెప్పారు: అయ్యన్న

ABN , First Publish Date - 2022-03-18T17:57:54+05:30 IST

విశాఖ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.

టీడీపీ ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్‌వేర్ కొనలేదని గౌతమ్ సవాంగే చెప్పారు: అయ్యన్న

విశాఖ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు. ‘‘నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి... సమాచార హక్కు చట్టం ప్రకారం 25-7-21న కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డీజీపీ సవాంగ్ 12-8-21న సమాధానం ఇచ్చారు. తాను, తన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలే అని స్వయంగా జగన్ బయటపెట్టడమే దేవుడి స్క్రిప్ట్..’’ అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.

Read more