మాజీ మంత్రి రెడ్డిని పరామర్శించిన అయ్యన్న
ABN , First Publish Date - 2022-09-12T06:40:05+05:30 IST
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలు ఆదివారం రాత్రి పరామర్శించారు.
చోడవరం, సెప్టెంబరు 11: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలు ఆదివారం రాత్రి పరామర్శించారు. చీడికాడ మండలం తురువోలులో ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు చోడవరం వచ్చిన అయ్యన్న, స్థానికంగా నివాసం ఉంటున్న రెడ్డి సత్యనారాయణను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు, మాడుగుల టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు తదితరులు ఉన్నారు.