‘మేలుకొలుపు’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2022-12-31T00:21:43+05:30 IST

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శుక్రవారం ‘మేలుకొలుపు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

‘మేలుకొలుపు’ పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ తదితరులు

పాడేరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శుక్రవారం ‘మేలుకొలుపు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వినియోగదారులను చైతన్యం చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల ప్రత్యేక సంచికగా ముద్రించిన ఈ పుస్తకాన్ని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జేసీ శివశ్రీనివాసు, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆవిష్కరించారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శివప్రసాద్‌, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ గణేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:21:47+05:30 IST