వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు వేలం

ABN , First Publish Date - 2022-11-24T01:24:28+05:30 IST

జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు బుధవారం పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో వేలం పాట నిర్వహించారు. జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఇందుకు సంబంధించి ముందుగానే ప్రకటన చేయడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా విశాఖ జిల్లా నుంచి కూడా భారీగా తరలివచ్చారు.

వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు వేలం
టోకెన్లు జారీచేస్తున్న పోలీసు అధికారులు

అనకాపల్లి టౌన్‌, నవంబరు 23 : జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు బుధవారం పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో వేలం పాట నిర్వహించారు. జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఇందుకు సంబంధించి ముందుగానే ప్రకటన చేయడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా విశాఖ జిల్లా నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలన, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బైండోవర్‌ చేయడం, పీడీ కేసులు నమోదు ఇందులో భాగమేనన్నారు. అనం తరం వేలం పాట నిర్వహించారు. 139 వాహనాలకు గాను 135 వాహనాలు వేలం వేయగా, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు మాత్రమే మిగిలిపోయాయి. అడిషినల్‌ ఎస్పీ, సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బి.విజయభాస్కర్‌, సెబ్‌ అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎ. రవికుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలం పాటలో ముందుగా పోలీసులు పాటదారుల నుంచి డిపాజిట్‌ కట్టించుకుని టోకెన్లు అందజేశారు. 139 వాహనాలకు గాను ఎంవీఐ నిర్థారించిన ఆప్‌సెట్‌ విలువ రూ.16 లక్షల 71వేల 600లు కాగా, వేలం పాటలో అధికంగా రూ.36 లక్షల 58వేల 500 రూపాయలు వచ్చినట్టు జీఎస్టీ (18శాతం) కలిపి మొత్తం రూ.43లక్షల 17వేల 030లు సమకూరినట్టు జిల్లా పోలీస్‌ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ దాడి మోహనరావు, ఎస్‌ఐ దివాకర్‌, ఏఎస్‌ఐ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T01:24:30+05:30 IST