అవినీతి, అక్రమ కేసులేనా జగన్‌ తెచ్చిన విప్లవాత్మక మార్పులు?: యనమల

ABN , First Publish Date - 2022-11-25T03:40:40+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కబ్జాలు, అవినీతి, అక్రమ కేసులేనా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

అవినీతి, అక్రమ కేసులేనా జగన్‌ తెచ్చిన విప్లవాత్మక మార్పులు?: యనమల

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కబ్జాలు, అవినీతి, అక్రమ కేసులేనా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. అబద్ధాలు, అసత్యాలు, ఆత్మద్రోహాలే తప్ప ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌రెడ్డి చేసిందేమీ లేదని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అప్పులపాలు చేసి అన్ని రంగాలనూ నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకాలను రద్దు చేసి 42 నెలలుగా నిరంకుశ, ఫాసిస్టు పాలనతో అరాచకం సృష్టిస్తున్నారన్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అంటూ బాధపడని వర్గం అంటూ రాష్ట్రంలో లేదన్నారు. చేతివృత్తుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు, రైతుల నుంచి కార్మికుల వరకు అందరూ జగన్‌కు వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భూహక్కు పత్రాలపై, పాసు పుస్తకాలపై, సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ ఫోటోలు ఉండాలనడం దుర్మార్గమన్నారు. సీఎం జగన్‌కు ప్రచార పిచ్చి తారస్థాయికి చేరిందని యనమల విమర్శించారు.

Updated Date - 2022-11-25T03:40:41+05:30 IST