కోటపాడు పోలీస్‌ సర్కిల్‌ ఏర్పాటుకు ఆమోదం

ABN , First Publish Date - 2022-11-06T01:05:08+05:30 IST

జిల్లాల పునర్విభజన తరువాత శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు సేవల విస్తరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం పోలీసు శాఖలో కొత్తగా సబ్‌ డివిజన్‌లు, పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేస్తోంది.

కోటపాడు పోలీస్‌ సర్కిల్‌ ఏర్పాటుకు ఆమోదం
కోటపాడు పోలీస్‌ స్టేషన్‌

అనకాపల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన తరువాత శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు సేవల విస్తరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం పోలీసు శాఖలో కొత్తగా సబ్‌ డివిజన్‌లు, పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో కొత్తగా గతంలో చోడవరం సర్కిల్‌లో ఉన్న కోటపాడు పోలీస్‌ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తూ శనివారం గెజిట్‌ విడుదల చేసింది. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తరువాత ఎస్పీ గౌతమి శాలి కోటపాడు సర్కిల్‌ ఏర్పాటుకు ప్రతిపాదన పంపారు. దీన్ని పరిశీలించిన రాష్ట్ర హోం శాఖ కోటపాడు పోలీస్‌ స్టేషన్‌ను సర్కిల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తూ గెజిట్‌ను విడుదల చేసింది. గతంలో చోడవరం సర్కిల్‌ పరిధిలో ఉన్న కోటపాడు పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోకి కోటపాడు, ఎ.కోడూరు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల పోలీసు స్టేషన్లు రానున్నాయి. ఇక ముందు కోటపాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో ఆయా స్టేషన్లు రానున్నాయి. అదే విధంగా చోడవరం పోలీస్‌ స్టేషన్‌ను ఒక ప్రత్యేక సర్కిల్‌గా ప్రకటించారు. గతంలో చోడవరం సర్కిల్‌ పరిధిలో వున్న బుచ్చయ్యపేట పోలీస్‌ స్టేషన్‌ కొత్తకోట సర్కిల్‌ పరిధిలోకి వెళ్లింది.

Updated Date - 2022-11-06T01:05:09+05:30 IST