Visakha: అత్యంత దుర్మార్గం ఏపీలోనే జరిగింది: జడ శ్రావణ్

ABN , First Publish Date - 2022-12-10T11:53:02+05:30 IST

అత్యంత దుర్మార్గం ఏపీ (AP)లోనే జరిగిందని, డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar) ఇబ్బందికర పరిస్థితిలో ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష్య పెంచుకుందనిన్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆరోపించారు.

Visakha: అత్యంత దుర్మార్గం ఏపీలోనే జరిగింది: జడ శ్రావణ్

విశాఖ (Visakha): అత్యంత దుర్మార్గం ఏపీ (AP)లోనే జరిగిందని, డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar) ఇబ్బందికర పరిస్థితిలో ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష్య పెంచుకుందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ (Sravan Kumar) అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రులు బొత్స (Bosta), ధర్మాన (Dharmana), ఇతర నాయకులు జగన్‌పై చేసిన వ్యాఖ్యలతో పోల్చుకుంటే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చాలా చిన్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌పై పిచ్చివాడుగా ముద్ర వేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌పై విశాఖ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. సుధాకర్ తల్లికి చేసిన అన్యాయం ఎవరు పూడ్చలేనిదన్నారు.

విశాఖలో సభ పెడుతున్నామని.. మొదటిసారిగా నిర్వహిస్తున్న సభ కోసం అక్టోబర్‌లో అనుమతి కోరామని ‘డాక్టర్ సభ వేదిక’ అని పేరు పెట్టామని జడ శ్రావణ్ చెప్పారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హై కోర్టును అశ్రయించామన్నారు. కోర్టు ఆదేశాలతో అనుమతులు ఇచ్చినా.. పోలీసులు నిన్నటి వరకు పర్మిషన్ ఇవ్వకుండా... 9వ తాదీ రాత్రి సభ పెట్టడానికి అనుమతి లేదని చెప్పడం దారుణమన్నారు. పోలీసులు వైసీపీ కండువా కప్పుకుని ఉద్యోగం చేస్తున్నారని విమర్శించారు. హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలని అని కూడా తెలియదా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల కారణంగా అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు.

డాక్టర్ సుధాకర్ పేరు పెట్టడమే ఇబ్బంది అయితే... పేరు కూడా తొలగిస్తామని కూడా చెప్పడం జరిగిందని జడ శ్రావణ్ తెలిపారు. తమ సభకు ప

ర్మిషన్ ఇవ్వని ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. పోలీసులా? రాజ్యాంగమా? తేల్చుకుందాం అంటూ ఆయన సవాల్ విసిరారు. అరకులో శనివారం మధ్యాహ్నం జరగబోయే డాక్టర్ సుధాకర్ స్మారక సభను విజయవంతం చేయాలని జడ శ్రావణ్ పిలుపిచ్చారు.

Updated Date - 2022-12-10T11:53:11+05:30 IST