దళిత వ్యతిరేక విధానాలు నశించాలి

ABN , First Publish Date - 2022-10-03T06:05:23+05:30 IST

దళిత వ్యతిరేక విధానాలు నశించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర ఉపాధ్యక్షుడు వై.రాజు డిమాండ్‌ చేశారు.

దళిత వ్యతిరేక విధానాలు నశించాలి
నిరసన వ్యక్తం చేస్తున్న కేవీపీఎస్‌ ప్రతినిధులు

డాబాగార్డెన్స్‌, అక్టోబరు 2 : దళిత వ్యతిరేక విధానాలు నశించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర ఉపాధ్యక్షుడు వై.రాజు డిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌, గాంధీ ఆశయాలకు అనుగుణంగా కేవీపీఎస్‌ పోరాడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, బడుగు, బలహీనవర్గాలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.సుబ్బారావు, విజయ, చంద్రశేఖర్‌, పాండే, సంతోశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more