అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే అమర్‌

ABN , First Publish Date - 2022-01-13T06:27:42+05:30 IST

అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా వైసీపీ అధ్యక్షునిగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా  వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే అమర్‌

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా వైసీపీ అధ్యక్షునిగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతవరకూ ఆ పదవిలో శరగడం చినఅప్పలనాయుడు ఉన్నారు. ఆయన గత ఏడాది జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 96వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. దీనికితోడు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజుతో విభేదాలు వున్నట్టు పార్టీలో కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను  తొలగించి ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ను నియమించి వుంటారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-01-13T06:27:42+05:30 IST