అప్పన్నను దర్శించుకున్న అనకాపల్లి కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-04-05T06:23:18+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామిని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ సోమవారం దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్న అనకాపల్లి కలెక్టర్‌
కప్పస్తంభం వద్ద అనకాపల్లి కలెక్టర్‌ రవి సుభాష్‌

సింహాచలం, ఏప్రిల్‌ 4: వరాహలక్ష్మీనృసింహస్వామిని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఏఈవో కేకే రాఘవకుమార్‌, పర్యవేక్షణాధికారి ఎస్‌.మహేశ్‌ ఆహ్వానం పలికారు. కప్పస్తంభం ఆలింగనం తర్వాత ఆయన గోత్రనామాలతో అర్చకులు అంతరాలయంలో పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 


Updated Date - 2022-04-05T06:23:18+05:30 IST