‘సీడ్స్’ ఘటనపై విచారణ జరపాలి
ABN , First Publish Date - 2022-08-04T07:01:17+05:30 IST
సీడ్స్ కర్మాగా రంలో ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం నాయకులు ఇక్కడి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పూడిమడక రోడ్డులో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
సీపీఎం నాయకుల డిమాండ్
పూడిమడక రోడ్డులో రాస్తారోకో
అరెస్టు చేసిన పోలీసులు
ప్రభుత్వ తప్పిదమే : ఏఐటీయూసీ నాయకులు
అనకాపల్లి టౌన్, ఆగస్టు 3 : సీడ్స్ కర్మాగా రంలో ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం నాయకులు ఇక్కడి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పూడిమడక రోడ్డులో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. బ్రాండిక్స్కు బస్సులు వెళ్లకుండా బైఠాయించారు. పట్టణ ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో వచ్చి సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఎ.బాలకృష్ణ, సీఐటీ యూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, వీవీ శ్రీనివాసరావులను అరెస్టు చేసి, స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను అరెస్టు చేయడం సరికాదని లోకనాథం పేర్కొన్నారు. సీడ్స్ సంఘటనకు సంబంధించి బ్రాండిక్స్ ఇండియా భాగస్వామి దొరస్వామిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తుమ్మపాల : సీడ్స్ కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జాతీయ కమిటీ సభ్యుడు బూసి వెంకటరావు డిమాండ్ చేశా రు. ఈ మేరకు బుధవారం ఎన్టీఆర్ వైద్యాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సీడ్స్ కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంవల్లే ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ వైఫల్యం కూడా ఉం దని మండిపడ్డారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్య క్రమంలో యూనియన్ నాయకులు వైఎన్ భద్రం, కోన లక్ష్మణ, ఎల్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.