టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి

ABN , First Publish Date - 2022-12-15T01:07:45+05:30 IST

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణను కోరారు.

టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి
డీఆర్‌వో వెంకటరమణకు వినతిపత్రం అందజేస్తున్న జగదీశ్‌ తదితరులు

అనకాపల్లి అర్బన్‌/ కలెక్టరేట్‌, డిసెంబరు 14: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణను కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి జిల్లా కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు అనకాపల్లి, సిరసపల్లి గ్రామాల మధ్య రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీకి కేటాయించిన విధంగా టీడీపీకి కూడా స్థలాన్ని ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పి.విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:07:47+05:30 IST