బీజేపీ పాలనలో పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం

ABN , First Publish Date - 2022-12-30T00:55:21+05:30 IST

బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం కావడమో లేదా మూసి వేయడమో జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు అన్నారు.

బీజేపీ పాలనలో పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం

సిరిపురం, డిసెంబరు 29 : బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం కావడమో లేదా మూసి వేయడమో జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు అన్నారు. భీమవరంలో వచ్చేనెల 2, 3, 4 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర మహాభలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జాతాకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి నగరానికి చేరుకున్న జాతాకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికులు గురువారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా కేంద్ర, రాష్ర్టాలు మారుస్తున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్రం, విశాఖ అభివృద్ధికి మూలమైన స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కార్మికవర్గం పోరాడుతుందని చెప్పారు. ఈ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్‌, సభ్యులు ఎస్‌. జ్యోతీశ్వరరావు, కేఎం కుమార్‌ మంగళం, బి. జగన్‌, ఆర్‌. లక్ష్మణమూర్తి, ఎం. సుబ్బారావు, ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, ఓ. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:55:27+05:30 IST