ఏయూ వీసీతో ఏఐఐఎల్ఎస్జీ డీజీ సమావేశం
ABN , First Publish Date - 2022-08-09T06:16:47+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సోమవారం వర్సిటీలో ఆల్ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్(ఏఐఐఎల్ఎస్జీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జైరాజ్ ఫాఠక్ సమావేశమయ్యారు.

ఏయూ క్యాంపస్, ఆగస్టు 8: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సోమవారం వర్సిటీలో ఆల్ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్(ఏఐఐఎల్ఎస్జీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జైరాజ్ ఫాఠక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏయూతో ఏఐఐఎల్ఎస్జీ సంస్థ ఎంవోయూ చేసుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. సంయుక్తంగా కోర్సుల నిర్వహణ, పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ఆచార్యులు చల్లా రామకృష్ణ, కృష్ణవీర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.