ఘనంగా ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ లాంచ్‌

ABN , First Publish Date - 2022-10-08T06:32:46+05:30 IST

ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ హీరోగా దక్షిణాది భాషాలన్నింటిలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ను అనకాపల్లి పర్తిసాయి థియేటర్‌లో శుక్రవారం ప్రభాస్‌ అభిమాన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ లాంచ్‌
కేక్‌ కట్‌ చేస్తున్న అభిమానులు

అనకాపల్లి టౌన్‌,  అక్టోబరు 7 : ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ హీరోగా దక్షిణాది భాషాలన్నింటిలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ను అనకాపల్లి పర్తిసాయి థియేటర్‌లో శుక్రవారం ప్రభాస్‌ అభిమాన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకుడు జీవీఎల్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రం మరో బాహుబలిలా అఖండ విజయాన్ని సాధిస్తుందన్నారు. అనంతరం పట్టణ ప్రభాస్‌ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను థియేటర్‌ మేనేజర్‌ సతీష్‌, ఏజెంట్‌ మూర్తి కట్‌ చేసి పంచిపెట్టారు. పట్టణ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు పెనుమత్స సతీష్‌ వర్మ, కాండ్రేగుల జోగేంద్ర, ఆంధ్రప్రదేశ్‌ వెంకటేష్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ కన్వీనర్‌ పి.చందు, బుద్ద శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read more