స్మార్ట్‌ యోజన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-17T05:55:48+05:30 IST

నిరుద్యోగులను నట్టేట ముంచిన స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని మానవ హక్కుల మండలి జిల్లా ఉపాధ్యక్షుడు తమరాన వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

స్మార్ట్‌ యోజన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
విలేఖర్లతో మాట్లాడుతున్న వెంకటరమణ


మానవ హక్కుల మండలి జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ  

రోలుగుంట, ఆగస్టు 16 : నిరుద్యోగులను నట్టేట ముంచిన స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని మానవ హక్కుల మండలి జిల్లా ఉపాధ్యక్షుడు తమరాన వెంకటరమణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటూ చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశారన్నారు. గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకుండా ఆ సంస్థ కార్యాలయాన్ని మూసేసి ఎండీ సుధాకర్‌ పరారైయ్యాడన్నారు. రోలుగుంట, రావికమతం, నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, తదితర మండలాల్లో వందల సంఖ్యలో నిరుద్యోగులను మధ్యవర్తుల ద్వారా చేర్చుకుని మోసం చేశారన్నారు. ఒక్క రోలుగుంట మండలంలోనే 10 గ్రామాల నుంచి 60 మంది వరకు నిరుద్యోగులు ఈ సంస్థలో మధ్యవర్తుల ద్వారా లక్షలు చెల్లించి రోడ్డున పడ్డారన్నారు. తక్షణమే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కురచా కామేశ్వరరావు, పిల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read more