నూకాంబిక ఆలయం అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2022-10-07T06:26:21+05:30 IST

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత అనకాపల్లి నూకాంబిక ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విజయ దశమిని పురస్కరించుకుని బుధవారం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రూ.ఏడు న్నర కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయన్నారు.

నూకాంబిక ఆలయం అభివృద్ధికి చర్యలు
నూకాంబికను దర్శించుకుంటున్న మంత్రి అమర్‌నాథ్‌

 మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లిటౌన్‌,  అక్టోబరు 6: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత అనకాపల్లి  నూకాంబిక ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విజయ దశమిని పురస్కరించుకుని బుధవారం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రూ.ఏడు న్నర కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయన్నారు. ఇప్పటికే రూ.మూడున్నర కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరయ్యాయని, ప్రాకార మండపానికి సంబంధించి ఫైల్‌ పెండింగ్‌లో ఉందని చెప్పారు. అమ్మవారి జాతర సమయాల్లో ఆలయ ఆవరణలో తాటాకు పందిళ్లు కాకుండా శాశ్వత ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌, మళ్ల బుల్లిబాబు, దాడి జయవీర్‌, మందపాటి జానకిరామరాజు, పలకా రవి, దంతులూరి శ్రీధర్‌రాజు, కొణతాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌లు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ పలకా యశోధ, కార్పొరేటర్‌ పీలా లక్ష్మీసౌజన్య తదితరులు వీరివెంటన ఉన్నారు. 

Read more