Visakha: దువ్వాడ స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని..

ABN , First Publish Date - 2022-12-07T11:04:26+05:30 IST

విశాఖ: దువ్వాడ (Duvvada) స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య శశికళ అనే విద్యార్థిని ఇరుక్కుంది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.

Visakha: దువ్వాడ స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని..

విశాఖ: దువ్వాడ (Duvvada) స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య శశికళ అనే విద్యార్థిని ఇరుక్కుంది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. గుంటూరు (Guntur)-రాయగఢ (Rayagada) ఎక్స్‌ప్రెస్ దిగుతున్న విద్యార్థిని రైలుకు-ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను బయటకు తీసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గంటకుపైగా స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. రైలు కదిలితే విద్యార్థినికి ప్రమాదం జరిగే అవకాశముంది. దీంతో యువతిని క్షేమంగా రక్షించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.

విద్యార్థిని శశికళ అన్నవరం నుంచి ప్రతిరోజు విశాఖ, దువ్వాడలో ఉన్న విజ్ఞాన కాలేజీకి వస్తుంది. ఈరోజు కూడా కాలేజీకి వస్తుండగా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా ఆమె కాలుజారి రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. దీంతో రైల్వే సిబ్బంది, పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి గంటకుపైగా శ్రమించి ఆమెను బయటకు తీసి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే నడుం భాగంలో కొంత గాయం అయినట్లు తెలియవచ్చింది. శశికళ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-12-07T11:04:30+05:30 IST