ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-16T00:56:50+05:30 IST
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కూర్మన్నపాలెం, డిసెంబరు 15: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన చీపురుపల్లి శ్రీను (36) వీఎస్‌ఈజెడ్‌లో బొకేయిస్టుగా పనిచేసేవాడు. భార్య వరలక్ష్మి, ఇద్దరు పిల్లలతో మంగళపాలెంలో నివసిస్తున్నాడు. అయితే రెండు నెలలుగా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమవుతుండడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. వరలక్ష్మి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. గురువారం మద్యం తాగిన శ్రీను అచ్యుతాపురంలో వుంటున్న తల్లికి ఫోన్ చేసి అమ్మా.. ఇవే నా ఆఖరు మాటలు, నేను ఆర్థిక ఇబ్బందులతో వున్నాను, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని చెప్పాడు. వెంటనే ఆమె కోడలు వరలక్ష్మికి ఈ సమాచారాన్ని అందించింది. వరలక్ష్మి ఇంటికి వచ్చేసరికే శ్రీను ఫ్యాన్‌ను ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తపాలెంలో మరొకరు..
గోపాలపట్నం, డిసెంబరు 15: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన 89వ వార్డు కొత్తపాలెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపాలెం గ్రామానికి చెందిన రాపేటి వెంకటసూరి అప్పారావు (56) నాగేంద్రకాలనీ జంక్షన్లో మెడికల్ షాపు నిర్వహించేవారు. వెంకటసూరి అప్పారావు మెడికల్ షాపుతో పాటు చిట్ ఫండ్ వ్యాపారంకూడా చేయడంతో కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం మధ్యాహ్నం అప్పారావు కుటుంబీకులు ఓ వివాహానికి వెళ్లారు. అయితే ఆయనతో పాటు మనవడు ఇంటిలో వుండగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో అప్పారావు పడుకుంటాని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్లారు. ఆ తర్వాత తాత అప్పారావు ఎంతసేపైనా మేల్కొనకపోవడంతో మనవడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సాయంత్రం ఆరున్నరప్పుడు కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని అప్పారావును ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావించి మృతుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఏఎస్ఐ జీవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుని వుంటారని కుటుంబీకులు భావిస్తున్నారు.