మూడేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-19T06:36:02+05:30 IST

గడిచిన మూడేళ్లలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు వెచ్చించామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు.

మూడేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి
డౌనూరులో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

కొయ్యూరు, ఆగస్టు 18: గడిచిన మూడేళ్లలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు వెచ్చించామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని డౌనూరు, నడింపాలెం సచివాలయ భవనాలు, బంగారమ్మపేటలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డౌనూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. డౌనూరు పంచాయతీలో రూ. 7.84 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. 7.55 కోట్లు అందజేశామన్నారు. ఈ సందర్భంగా చిట్టింపాడు ఉప సర్పంచ్‌ పాడి దారలక్ష్మి గోపవరం గ్రామానికి సీసీ రోడ్లు నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్‌పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, ఎంపీపీ బడుగు రమేష్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు బిడజాన అప్పారావు, బీసీ కార్పొరేషన్‌ (కొప్పులవెలమ) డైరక్టర్‌ నాగమణి, వైస్‌ ఎంపీపీ అప్పన వెంకటరమణ, సర్పంచ్‌లు పొట్టిక భవాని, రావుల వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.  కాగా, నడింపాలెం సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే ఎమ్మెల్యే ప్రారంభించారు. భవనానికి గచ్చులు, విద్యుత్‌ వైరింగ్‌ జరపలేదు. అరకు ఎంపీ జి.మాధవి స్వగ్రామానికి కూతవేటు దూరంలో గల ఈ సచివాలయ భవనాన్ని ఆమె లేకుండా ప్రారంభించడంపై ఎంపీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-08-19T06:36:02+05:30 IST